BREAKING
టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు "రాజా"నగరంలో బత్తుల పరాభవం! జాతీయ కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ ....విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం ఎంపీ పురందేశ్వరి ఆశీస్సులు తీసుకున్న రత్న మహేశ్వరి విద్యా వికాసానికి ఆజాద్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయం... కలెక్టర్ మహేష్ కుమార్.... బిజెపిలోకి లింగమడుగు ఉపసర్పంచ్

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

Select Suryaa Now
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..  - ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర  - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

 

సూర్య – పెద్దపల్లి రూరల్ : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు విక్రయించి, ఆర్థికంగా లబ్ధి పొందాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. బుధవారం పెద్దపల్లి మండలంలోని బొంపల్లి, కాసులపల్లి, పాలితం, గోపయ్యపల్లి, కాపులపల్లి, కనగర్తి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని  పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని, నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సేకరణ చేపట్టాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
 రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తూ రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో మండల వ్యవసాయ అధికారి నాగార్జున,  అప్పన్నపేట సింగిల్ విండో చైర్మెన్ చింతపండు సంపత్, పెద్దపల్లి సింగిల్ విండో చైర్మన్ నరేష్ ముత్యాల, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్లు,   కాంగ్రెస్ నాయకులు  ఏ ఈ వో లు వినయ్ కుమార్, పూర్ణ చందర్ ఐకేపీ సిబ్బంది, సంబంధిత అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.