విద్యారంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
నరసరావుపేట : భారత విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం పట్టణంలోని చిత్రాలయ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.
ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లో హిందూ, ముస్లిం సోదరులు ఐక్యంగా ఏర్పాటు చేసిన ఆజాద్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ దేశ విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేశారని తెలిపారు. ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేం దుకు ఐఐటీ, యూజీసీ, ఐఐఎస్సీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల అభివృద్ధికి పునాది వేశారని గుర్తుచేశారు. భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు వివిధ అకాడమీల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారని చెప్పారు. చిత్రాలయ సెంటర్‌ను ఆజాద్ సెంటర్‌గా మార్చి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులను, ముస్లిం మైనారిటీ పెద్దలను ఎమ్మెల్యే అభినందించారు. మత సామరస్యానికి, జాతీయ సమైక్యతకు ఆజాద్ జీవితం ఆదర్శమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వం లో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదే శ్‌గా తీర్చిదిద్దేం దుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఆజాద్ ఆశయా లను కొనసాగిస్తూ మత సామరస్యాన్ని కాపాడాలని, దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఆజాద్ యూత్ అసోసి యేషన్ సభ్యులు, ముస్లిం మైనారిటీ పెద్దలు, విద్యావేత్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…