సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్
కోహెడ ; కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలోని రైతు వేదిక వద్ద గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి వడ్ల కొనుగోలు సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు. బార్ధన్ రాగానే వడ్లుకంటలు పెట్టడం జరుగుతుందని చెప్పారు. ఏ పైరవీలకు తావు లేకుండా సీరియల్ వైజు వడ్లు కాంటలు పెట్టాలని పాలకవర్గం అధికారులకు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మగటం విజయ, గ్రామ ఉపసర్పంచ్ చింతకింది సింగరయ్య, వార్డు మెంబర్లు శివరాత్రి ఎల్లం, కాన్సెట్టి వీరన్న, పిల్లి రజిని సింగిల్ విండో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ కొల్ల రాంరెడ్డి, సొసైటీ సిబ్బంది చందు హమాలీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పున్నం సత్తయ్య, గ్రామ రైతులు సమ్మయ్య యాదయ్య రాజు మల్లారెడ్డి గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.