BREAKING
యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

తిరుపతి నగరపాలక సంస్థ కు 'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్

Select Suryaa Now
తిరుపతి నగరపాలక సంస్థ కు  'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్

తిరుపతి నగరపాలక సంస్థ కు  'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్

తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్ : న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 జాతీయ పురస్కారాన్ని మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ బుధవారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్వేలో తిరుపతి కి వరుసగా నాల్గవసారి కూడా జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. 
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయం నగర ప్రజల సహకారం, పారిశుధ్య కార్మికుల కష్టానికి, అధికారుల సమష్టి కృషి వల్లే దక్కిందని తెలిపారు. భవిష్యత్తులో నగరాన్ని మరింత సుందరంగా, శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంటింటి చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్వ హణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపింగ్ యార్డుల్లో చెత్త నిల్వల్ని తగ్గించడం, ప్రభుత్వ గోడలపై బొమ్మలు, సుందరీకరణ, వ్యర్థాల నుంచి పరికరాల తయారీ, ఈ- వేస్ట్ సేకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్చత పోటీల్లో అదికారులు చేసిన కృషి ఫలి తంగా ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందు కోనుండడం తమ బాధ్యత మరింత పెంచిందని కమిషనర్ జయకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డి.ఈ.రమణ, మస్తాన్, తదితరులు ఉన్నారు

Raaju బ్యూరో,తిరుపతి జిల్లా