BREAKING
వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు ప్రకృతి విపత్తులకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం డీపీఎం కె. అమల కుమారి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు–ధాన్యం ట్రాక్టర్ ఢీ.. 12 మందికి గాయాలు భూముల రీసర్వేలో పారదర్శకతే ప్రామాణికం! నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు తిరుపతి నగరపాలక సంస్థ కు 'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్ మానవత్వం చాటుకున్న కలెక్టర్ కృతిక శుక్ల 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక విద్యారంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కరెంటు షాక్ తో రెండు గేదెలు మృతి

అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు

Select Suryaa Now
అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు

దుర్గి మండలంలోని మంగాపురం తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌పై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తండాలో ఆందోళన నెలకొంది. గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.వైద్యులు బాలుడి కుడి కాలు, కుడి చేయి పూర్తిగా దెబ్బతిన్నట్లు సూచించినట్లు సమాచారం. చిన్నారి తండ్రి శ్రీను నాయక్ కుటుంబంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. అప్పటివరకు ఆడుకుంటూ కనిపించిన బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.ఈ ఘటనతో మంగాపురం తండాలో విషాద వాతావరణం నెలకొంది.

 

పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి