ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి
ఎన్నికల విధుల ఉద్యోగులకు పెంచిన గౌరవ వేతనాన్ని చెల్లించాలి
-ఎస్ఈసికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల విజ్ఞప్తి
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో.. పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు.. పెంచిన వేతనం ఇవ్వాలని, భోజనం, రవాణా సౌకర్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ పూనేటను ఉద్యోగ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు జీవో నెంబర్ 1345 ప్రకారం, జీవో నెంబర్ 1086 ప్రకారం ప్రభుత్వం పెంచిన గౌరవ వేతనాలను .. ఇతర సదుపాయాలు సక్రమంగా అందడం అందరం లేదని ఉద్యోగం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. ఎస్ఈసికి వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులందరికీ ఒకేసారి.. ప్రభుత్వం నిర్దేశించిన గౌరవవేతనాలను జమ చేయాలని కోరారు.పంచాయతీరాజ్ శాఖ లో పిడివో లు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిన.. మొత్తం తిరిగి చెల్లించాలని, పోలింగ్ కేంద్రాల వారిగా ఖర్చు లెక్కల్లో చూపిస్తూ.. అడ్వాన్స్గా ఆ ఖర్చుపెట్టిన.. మొత్తాన్ని పంచాయతీ అధికారులకు తిరిగి చెల్లించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల వీరిలో ఉద్యోగులు తీవ్ర శారీరక మానసిక ఒత్తిడి గురవుతున్న నేపథ్యంలో.. ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్నాయి ఇబ్బందులు, ఖర్చుల చెల్లింపు పై అందిన ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పందిస్తూ ఈనెల 12న జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో.. పై అంశాలను చర్చించి.. పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగినేని శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా నాయకులు శ్రీనివాసరావు, జోజి బాబు, సుజాత, ఏం రాణి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.