BREAKING
ప్రకృతి విపత్తులకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం డీపీఎం కె. అమల కుమారి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు–ధాన్యం ట్రాక్టర్ ఢీ.. 12 మందికి గాయాలు భూముల రీసర్వేలో పారదర్శకతే ప్రామాణికం! నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు తిరుపతి నగరపాలక సంస్థ కు 'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్ మానవత్వం చాటుకున్న కలెక్టర్ కృతిక శుక్ల 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక విద్యారంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కరెంటు షాక్ తో రెండు గేదెలు మృతి పాల్వాయి లో శుభకార్యానికి హాజరైన యువ నాయకుడు తలారి సాయి హర్ష.

మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం.

Select Suryaa Now
మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం.

**అనంతపురం:-

జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌లలో కో-ఆప్టెడ్ సభ్యుల ఎంపికతో పాటు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మండల ప్రజా పరిషత్‌ల కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని 31 మండలాలకు 31 మంది ప్రభుత్వ గెజిటెడ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ప్రతి మండల ప్రజా పరిషత్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు నియమిత అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ నియామకాల ప్రకారం అనంతపురం మండలానికి ఆర్‌సీటీసీ డీఆర్‌/ఫ్యాకల్టీ, ఎస్‌ఈ పి.నారాయణస్వామి, ఆత్మకూరుకు పశుసంవర్ధక శాఖ ఏడీ కిరణ్‌కుమార్‌రెడ్డి, బుక్కరాయసముద్రానికి ఉరవకొండ సీడీపీఓ బి.ఎన్.శ్రీదేవి, గార్లదిన్నెకు అనంతపురం డీఎస్‌డీవో ఎస్‌.ఎం.మంజుల, కూడేరుకు ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, నార్పలకు సీడీపీఓ ఎన్‌.భారతి, పెద్దపప్పూరుకు ఏపీ మార్కెట్ జిల్లా మేనేజర్ పి.ఎం.పెన్నేశ్వరి, పుట్లూరుకు ఏడీసీసీ బ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రార్ బి.నాగరాజు, రాప్తాడుకు వ్యవసాయ శాఖ ఏడీ ఎం.రవి, సింగనమలకు సీడీపీఓ సి.లలితమ్మ, తాడిపత్రికి పశుసంవర్ధక శాఖ ఏడీ ఎస్‌.ఖాదర్‌భాషా, యల్లనూరుకు బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా కన్వీనర్ జి.హర్షద్‌వలిని నియమించారు. అలాగే బెలుగుప్పకు రాయదుర్గం పీఆర్ఐ సబ్‌డివిజన్ డీఈఈ బి.ఎన్.ఎన్.ప్రసాద్, బొమ్మనహల్‌కు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్-2 డీఈఈ గోపాల్‌నాయక్, బ్రహ్మసముద్రానికి కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ ఏడీ ఎన్‌.పి.ఎల్లప్ప, డి.హీరేహాల్‌కు అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌ఓ రామచంద్రుడు, గుమ్మగట్టకు పశుసంవర్ధక శాఖ ఏడీ బి.శ్రీనివాసులు, కళ్యాణదుర్గానికి అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ ఎస్‌.వెంకటేశ్వర్లు, కంబదూరుకు డ్వామా పీడీ ఎన్‌.సలీం భాషా, కనేకల్‌కు పశుసంవర్ధక శాఖ ఏడీ సి.హెచ్.లక్ష్మీశైలజను నియమించారు. కుందుర్పి మండలానికి శెట్టూరు ప్రాంతీయ పశువైద్యశాల ఏడీ కె.నాగలింగేశ్వరరెడ్డి, రాయదుర్గానికి వెటర్నరీ ఏడీ వి.అమరేశప్ప, శెట్టూరుకు జిల్లా రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, గుత్తికి వ్యవసాయ శాఖ ఏడీ వెంకటరాముడు, గుంతకల్లుకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, పామిడికి డీఎంహెచ్‌ఓ కార్యాలయ స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పెద్దవడుగూరుకు డీవీఈఓ వెంకటరమణ నాయక్, ఉరవకొండకు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్‌.సాలురెడ్డి, వజ్రకరూరుకు డ్వామా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ, విడపనకల్లుకు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఆఫీసర్ నాసరరెడ్డి, యాడికికి ఫుడ్ సేఫ్టీ శాఖ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కె.షమీమ్ భాషాను నియమించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలు, సమన్వయంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా నియమిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కుందుర్పి, కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం, శెట్టూరు మండలాల్లోనూ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు అధికారులు నియమితులు కావడంతో స్థానికంగా మండల పరిషత్‌ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.