పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం
పొన్నూరు మేజర్ న్యూస్ :-పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామంలోని శివాలయంలో వరుసగా ఐదవ సంవత్సరం మాల ధరించిన స్వాముల కోసం 41 రోజుల పాటు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించడం జరిగింది. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. అన్నదానం మహాదానం.. ఆకలి తీర్చడమే నిజమైన దైవసేవ. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమైన కార్యమని పెద్దలు చెబుతుంటారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వెల్లలూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారులు, ఇతర స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన నిర్వహణ కమిటీ సభ్యులు కోరారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులు పుప్పాల గోపి, ఇక్కుర్తి వెంకటేష్, బండ్రెడ్డి రవికుమార్, అయ్యప్ప స్వామి భక్తులు గ్రామస్తులు, పాల్గొన్నారు
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్