BREAKING
ప్రకృతి విపత్తులకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం డీపీఎం కె. అమల కుమారి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు–ధాన్యం ట్రాక్టర్ ఢీ.. 12 మందికి గాయాలు భూముల రీసర్వేలో పారదర్శకతే ప్రామాణికం! నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు తిరుపతి నగరపాలక సంస్థ కు 'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్ మానవత్వం చాటుకున్న కలెక్టర్ కృతిక శుక్ల 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక విద్యారంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కరెంటు షాక్ తో రెండు గేదెలు మృతి పాల్వాయి లో శుభకార్యానికి హాజరైన యువ నాయకుడు తలారి సాయి హర్ష.

నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు !

Select Suryaa Now
నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు !

నీటిని వృథా చేస్తే జరిమానా మారకుంటే నల్లా కనెక్షన్ కట్!

ఇంటింటికీ అవగాహన కల్పించిన సర్పంచ్  రేణుక నాగరాజ్

పెద్దకొత్తపల్లి, సూర్య న్యూస్: గ్రామంలో తాగునీటి వృథాను అరికట్టి, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సర్పంచ్ రేణుక నాగరాజ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. నీటి వృథాను అరికట్టేందుకు  అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక నాగరాజు  మాట్లాడుతూ తాగునీటిని వృథా చేయడం వల్ల ఇతర కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. హెచ్చరికలు చేసినప్పటికీ నీటిని వృథా చేస్తే నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామని, అప్పటికీ స్పందించకపోతే నల్లా కనెక్షన్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. గ్రామ పరిశుభ్రత, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నాగ శేషు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.