BREAKING
అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు–ధాన్యం ట్రాక్టర్ ఢీ.. 12 మందికి గాయాలు భూముల రీసర్వేలో పారదర్శకతే ప్రామాణికం! నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు తిరుపతి నగరపాలక సంస్థ కు 'సూపర్ స్వచ్ఛ లీగ్' అవార్డ్ మానవత్వం చాటుకున్న కలెక్టర్ కృతిక శుక్ల 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ TUWJ (IJU) వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక విద్యారంగానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కరెంటు షాక్ తో రెండు గేదెలు మృతి పాల్వాయి లో శుభకార్యానికి హాజరైన యువ నాయకుడు తలారి సాయి హర్ష. సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్

విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు

Select Suryaa Now
విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఆర్ట్స్ విభాగంలో చదువుతున్న విద్యార్థులను వర్సిటీ అధికారులు జంతువులులా పరిగణిస్తున్నారని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్సిటీలో ఆర్ట్స్ విభాగం విద్యార్థులు నివసించే ఈ బ్లాక్ వసతి గృహంలో చిన్న గదిలో నలుగురుని ఇరికించి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా ప్రశ్నించిన విద్యార్థులపై దౌర్జన్యానికి దిగుతూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై వీసీ టాటా నర్సింగరావుకు విన్నవించామని త్వరలో కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి సైతం సమస్యలపై స్పందించారని తెలిపారు. విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లాసెల్ కోకన్వీనర్ దివాకర్, యూనివర్సిటీ అధ్యక్షుడు చెన్నకేశవుడు, చామంచి గురు ప్రసాద్ యాదవ్, ఏబీవీపీ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్