నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొయ్యలగూడెం రూరల్ , మేజర్ న్యూస్ :వాహనని నిర్లక్ష్యంగా అతివేగగా నడపడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామంలో వెలగల దిబ్బ వద్ద చోటుచేసుకుంది .
ఫిర్యాది మృతుడి భార్య టెక్కం సుబ్బలక్ష్మి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు టెక్కం భాస్కరరావు,
సుబ్బలక్ష్మి తన చిన్న కుమార్తె ను గవర్నమెంట్ జడ్పీ హైస్కూల్లో దించి మరల తిరిగి ప్రయాణమై తన వాహనంపై బయ్యన గూడెం నుండి కుడి వైపుకు రాగా మృతుడు నడుపుతున్న వాహనాన్ని వెనక వస్తున్న వాహనం బలంగా ఢీకొనడంతో మృతుడు సంఘటన స్థలంలో మృతి చెందినట్లు ఆమె తెలిపారు . అంబులెన్స్ లో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కు తరలించగా పరీక్షించి మృతుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారని ఆమె అన్నారు .
కొయ్యలగూడెం ఎస్సై. జె . చంద్రశేఖర్ ఘటనపై మాట్లాడుతూ ఫిర్యాది మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు .