BREAKING
వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు కుంగ్ ఫూ, కరాటేలో ప్రత్యేక శిక్షణ నీటి వృథా, దుమ్ము కాలుష్యంపై సర్పంచుల ఆందోళన గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు * అధికారులకు బాధ్యతలపై దిశానిర్దేశం * భక్తిశ్రద్ధలతో గోవర్ధన పూజ నిర్వహించిన శీర్వి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు హంబాడ్ మోహన్ లాల్ చౌదరి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించాలి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ... 40 వ వార్డులో డ్రైనేజీలు పరిశుభ్రత.. జాతీయ విద్యా దినోత్సవం.. విద్యార్థులకు క్విజ్ పోటీలు ఖచ్చితమైన, నాణ్యమైన డేటా సేకరించాలి అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు

భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?!

Select Suryaa Now
భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?!

సిద్దిపేట, మేజర్ న్యూస్ ప్రభుత్వాలు మారుతున్నా ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతుల బతుకులు మారడం లేదని పలు ప్రాజెక్టుల భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు వెంటనే అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం 
సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్, అంతగిరి, గౌరవెల్లి ప్రాజెక్టుల భూ నిర్వాసితులు మాట్లాడారు.  2016లో నిర్వహించిన దీక్షలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో జీవో నంబర్‌ 123 ద్వారా తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని వాపోయారు. ప్రాజెక్టులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా అనేకమంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు కూడా అందలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించడంతో పాటు కోర్టులను ఆశ్రయించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ పలుకుబడి ఉన్నవారికి భూములు, ఇళ్లు కేటాయించి, అర్హులైన కొంతమంది భూ నిర్వాసితులను విస్మరించారని ఆరోపించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆలోపే తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ కుటుంబాలతో కలిసి పాదయాత్రగా ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో భూ నిర్వాసితులు ఎండీ హయతుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, పోచయ్య, ప్రవీణ్, బాబు, ప్రభాకర్, ఎల్లారెడ్డి, ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.