టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-అనంతపురం ఏ. నారాయణపురం జనసేన పార్టీ ఎంపీటీసీ-2గా విజయం సాధించిన లాల్ స్వామి, తన విజయానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయల మురళికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కిరెడ్డి ఆదినారాయణ, వల్లంశెట్టి రమణ, నారాయణప్ప, వీర మహిళలు అనసూయమ్మ, తిరుమల, వల్లంశెట్టి నాగరాజు తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..