కందవాడకు ఉచిత అంబులెన్స్!
రంగారెడ్డి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కందవాడ గ్రామ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చేవెళ్ల మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ సోలిపురం సుచరిత బల్వంత్‌రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత నిధులతో గ్రామస్తుల కోసం ఉచిత అంబులెన్స్‌ను సమకూర్చారు. తన తండ్రి కీర్తిశేషులు సోలిపురం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ నూతన అంబులెన్స్‌ను గురువారం ఉదయం 10 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుచరిత బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో వైద్య సేవల కోసం గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తండ్రి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.