BREAKING
అధికారులు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే సంజీవరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల మురళికి జనసేన ఎంపీటీసీ లాల్ స్వామి కృతజ్ఞతలు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతిపాదించిన కేంద్రాలు గ్రామాల పేర్లు, కోడ్లు, జనాభా వివరాలు భూ నిర్వాసితులను ఇంకెప్పుడు ఆడుకుంటారు?! సీఎం సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్, సిపి బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీకాంత్ గౌడ్ ల్యాండ్‌ పూలింగ్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త రూపు:కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం... *సీసీ కెమెరాల నిఘానిడలో పోరేడ్డిపల్లి గ్రామం* చిన్నారి శారీ ఫంక్షన్‌లో పాల్గొని ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక చిన్న మొత్తానికి ఆశపడి చిక్కుల్లో పడొద్దు ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్ హెచ్చరిక ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం

అధిక సాంద్రత పద్ధతితో పత్తిలో అధిక దిగుబడి

Select Suryaa Now
అధిక సాంద్రత పద్ధతితో పత్తిలో అధిక దిగుబడి

 

• కపాస్ క్రాంతి పథకంతో రైతులకు ప్రోత్సాహం

• అధిక సాంద్రత సాగుతో మెరుగైన ఫలితాలు సాధ్యం ఏఈఓ సాగర్

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతిని అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కాశిపేట మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సాగర్ అన్నారు. బుధవారం నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక సాంద్రత పత్తి పంట క్షేత్ర ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని రైతులకు సాగు విధానంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏఈఓ సాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఏడాది కపాస్ క్రాంతి పథకం కింద రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు అందించి అధిక సాంద్రత సాగు విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ పద్ధతిలో ఎకరాకు మొక్కల సంఖ్యను పెంచడంతో పాటు, పంట ఎదుగుదలను నియంత్రించేందుకు మెపిక్వాట్ క్లోరైడ్ మందును సూచించిన విధంగా పిచికారీ చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు.

నూజివీడు సీడ్స్‌కు చెందిన అర్మిత ఎన్‌సీఎస్ 2778 రకం అధిక సాంద్రత పద్ధతిలో సాగుకు అనువైనదని, రైతులు ఈ రకంపై అవగాహన పెంచుకొని సాగు విధానాలను పాటించాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ టెరిటరీ మేనేజర్ రాజబాబు, మార్కెట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వెంకటేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.