రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి పట్టణం లోని రాణి మల్లమ్మ దేవి పార్కు ను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి బుధవారం పరిశీలించారు. ఈ మేరకు కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో రాణి మల్లమ్మ దేవి పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రాణి మల్లమ్మ దేవి పార్కు నందు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి డిసెంబర్ ఆఖరుకు బ్యూటిఫికేషన్ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పార్కులో ఏ ఏ అభివృద్ధి పనులను చేపట్టాలో సూచనలు జారీ చేశారు. పార్కులో ఉన్న టాయిలెట్లకు మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. డిసెంబర్ నెల ఆఖరికి పార్కులో అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.