BREAKING
ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ: స్పెషల్ స్ట్రే రౌండ్ తర్వాత కూడా చేరని విద్యార్థులు వైసీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ రేపు చాపల చెరువుకు జలహారతి... భారీ సంఖ్యలో హాజరుకానున్న మహిళలు, రైతులు. నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు.

వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
వచ్చే జూన్ వరకు జిల్లాలో  తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి*  *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని  తాగునీటికి మాత్రమే వినియోగించాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్ 11: వచ్చే జూన్ వరకు జిల్లాలో ఎక్కడా   తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని  తాగునీటికి మాత్రమే వినియోగించాలని, పంటల సాగుకు ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తీరుపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో  గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా  తాగునీటి సమస్య రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ వరకు ఉన్న నీటిని తాగునీటి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.  గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని  తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని, ఈ నీటితో రబీ లో రైతులు పంటలు సాగు చేయడానికి వీలు లేదని  కలెక్టర్ స్పష్టం చేశారు... ఈ మేరకు అధికారులతో టీములు ఏర్పాటు చేసి వారి ద్వారా  రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్  ఆర్డీవోలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు.  సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు అన్నింటినీ నీటితో నింపాలని, తుంగభద్ర, హంద్రీ నీవా నీటిని తాగునీటి కోసం తగిన విధంగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్  మున్సిపల్, ఆర్ డబ్ల్యు ఎస్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ ఈ మనోహర్, ఇరిగేషన్ ఎస్ ఈ శైలేష్ కుమార్, హంద్రీనీవా ఎస్ ఈ రాజన్ బాబు, పబ్లిక్ హెల్త్ ఈ ఈ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.