telangana
చౌక ధరలకే జనరిక్ ఔషధాలు లభ్యం - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : జనరిక్ మెడికల్ షాపుల ద్వారా రోగులకు చౌక ధరలకే ఔషధ మందులు లభిస్తాయని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ షాపును ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు కిరణ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జెనరిక్ మెడికల్ షాపుల ద్వారా ప్రజలకు 20 శాతం నుండి 80 శాతం వరకు రాయితీతో కూడిన నాణ్యమైన మందులు తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. ప్రజలు, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.