BREAKING
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు

Select Suryaa Now
ఫుడ్ ప్రాసెసింగ్‌కు  ఏపీలో అపారమైన అవకాశాలు

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్-యూఏఈలకు చెందిన వివిధ ప్రముఖ కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.  రాయలసీమకు చెందిన ఫలాలు ఇప్పటికే  విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని సీఎం చంద్రబాబు తౌక్ అల్ మర్రీ దృష్టికి తెచ్చారు. రూ.1 లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. యూఏఈ ఏర్పాటు చేయనున్న ఫుడ్ క్లస్టర్‌లో ఆ దేశానికి చెందిన అగ్రిఫుడ్ కంపెనీ సిలాల్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలోని ఏపీ, వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లాలో దుబాయికి చెందిన ఫ్లోర్‌మాస్టర్ పరిశ్రమ గ్రౌండింగ్ విషయం కూడా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఫుడ్ క్లస్టర్ లో త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ మంత్రి తౌక్ మర్రిని కోరారు. అలాగే మారిటైమ్, ఏరో స్పేస్, డిఫెన్స్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూఏఈతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

*భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ఉంది: యూఏఈ మంత్రి*

ఏపీలో నూతనంగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ఉందని యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ తౌక్ మర్రి ముఖ్యమంత్రితో అన్నారు. సుందరమైన విమానాశ్రయాన్ని ఏపీలో నిర్మించిన సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. భారత తూర్పు తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తిగా ఉందని.. తమ దేశ పెట్టుబడులకు ఏపీ కీలక ప్రాంతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి బ్లూచిప్ కంపెనీలు, గూగుల్ లాంటి డేటా సెంటర్లు రావటం శుభపరిణామం అని అన్నారు. పెట్టుబడులను రాబట్టే విషయంలో ఏపీకి ఉన్న సామర్ధ్యం ఏమిటో తెలుస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలతో పాటు ఇతర ఆక్వా ఉత్పత్తుల దిగుమతులపై ఆలోచన చేస్తున్నట్టు యూఏఈ ప్రతినిధి బృందం తెలిపింది. ఏపీలో పెట్టనున్న ఫుడ్ క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన మరో 12 కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని సీఎంకు వివరించారు. ఈ భేటీలో యూఏఈకి చెందిన అధికారులు, కంపెనీల ప్రతినిధులు, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.