BREAKING
ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా

నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

Select Suryaa Now
నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

నెల్లూరు కలెక్టరేట్,  మేజర్ న్యూస్ :  సేవా కార్యక్రమాల్లో భాగంగా దగదర్తి గ్రామానికి చెందిన తాళ్ళూరి సోదరులు తమ ఉదారతను చాటుకున్నారు. నెల్లూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తమ తండ్రి స్వర్గీయ తాళ్ళూరి రమణయ్య నాయుడు జ్ఞాపకార్థం తాళ్ళూరి వెంకట కృష్ణ ప్రసాద్, తాళ్ళూరి రవిప్రసాద్ ఈ విరాళాన్ని అందించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీఎస్ క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ యాలమూరి రంగయ్య నాయుడు, డీఆర్ఓ ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తాళ్ళూరి సోదరులు మాట్లాడుతూ, పేద, నిరుపేద క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తమ తండ్రి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి చెందితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  విరాళం అందించిన తాళ్ళూరి సోదరులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవలో భాగస్వాములవుతూ, పేద రోగులకు వైద్య సేవలు అందించేందుకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.