BREAKING
మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా

చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం!

Select Suryaa Now
చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం!

అనంతసాగరం, మేజర్ న్యూస్ :   సోమశిల ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద చెక్‌పోస్ట్ బారియర్ (కర్ర) లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్ వద్ద బారియర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, అది లేకపోవడంపై విలేకరులు అక్కడి అధికారులను ప్రశ్నించారు.  అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బీట్ ఆఫీసర్ దురుసుగా స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. "ఏంటి నువ్వు మమ్మల్ని బెదిరించేది? నీకు ఏమి రాయాలనిపిస్తే అది రాసుకో" అంటూ సమాధానం ఇచ్చినట్లు విలేకరులు తెలిపారు.  ప్రజా సమస్యలపై ప్రశ్నించడం విలేకరుల బాధ్యత. చెక్‌పోస్ట్ వద్ద బారియర్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరు? అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.