BREAKING
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం.

9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..!

Select Suryaa Now
9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..!

జలదంకి, మేజర్ న్యూస్ : జలదంకి మండలంలోని 9వ మైలు గ్రామంలో పోలీసులు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కలిగిరి సీఐ పి. సుబ్బారావు పర్యవేక్షణలో జలదంకి ఎస్సై వీరేంద్రబాబు తన సిబ్బందితో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గ్రామంలో విస్తృత తనిఖీలు.. భద్రతపై ప్రత్యేక దృష్టి..
కార్డన్ & సెర్చ్‌లో భాగంగా గ్రామంలోని వివిధ ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదమే.. నిబంధనలు పాటించాలి.
ఈ సందర్భంగా కలిగిరి సీఐ పి. సుబ్బారావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. ప్రాణాల రక్షణకు రహదారి భద్రతా నియమాలు ఎంతో ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్సై సయ్యద్ లతీఫున్నిసా, వింజమూరు ఎస్సై ఉమామహేశ్వరరావు, కలిగిరి సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.