BREAKING
మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య

తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

Select Suryaa Now
తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

 

తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

 

త్రాగు నీటి ఎద్దడి నివారణ కొరకు జిల్లాలో 13 మండలాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

 

 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్.జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో త్రాగునీటి ఎద్దడి నివారణపై జిల్లాలో డి ఈ ఆర్ డబల్ యు ఎస్ శాఖకు చెందిన ఇంజనీర్లతో ఏ ఈ ఎస్ , ఏ ఈ ల తో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూ ఎస్సీ ఈ, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి గ్రామం లోని ప్రతి ఆవాస ప్రాంతంలో తాగునీటి నాణ్యతను పరీక్షించాలని తెలిపారు. ఏ ప్రాంతంలో నీరు సురక్షితంగా ఉంది, ఎక్కడ కలుషితమయ్యే ప్రమాదం ఉందో క్షేత్రస్థాయిలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, తాగునీటి నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. నీటి నాణ్యత అసురక్షితంగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కొత్త బోర్‌వెల్లు ఏర్పాటు చేయడం, పాత పైపులైన్లను మార్చడం, లీకేజీలను అరికట్టడం వంటి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పనులకే నిధులు ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.ప్రజలకు తాగునీటికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రజలు సురక్షితమైన తాగునీరు అందజేయాలని జిల్లా కలెక్టర్ హోదాలో ఆదేశించారు, రేపటినుండి త్రాగునీటి పనులు చేపట్టాలని ఆదేశించారు.ప్రతి మండలంలో కనీసం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తాగునీటి సరఫరా మెరుగుదలకు సంబంధించిన పనుల అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన చోట కొత్త పైపులైన్లు వేయడం, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడం, నీటి సరఫరా వ్యవస్థకు మరమ్మతులు చేపట్టడం వంటి పనులను గుర్తించాలన్నారు. ముఖ్యంగా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు జనాభా పెరిగినప్పటికీ తగిన తాగునీటి సదుపాయాలు లేని ఆవాస ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఎంపీడీవోలు, సంబంధిత ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

ఫోటో. అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్