BREAKING
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం

Select Suryaa Now
డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి  రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం

చిట్టమూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మొలకలపూడికి చెందిన గొట్టికాటి రవీంద్రా రెడ్డి విజయవాడ డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటి (డిఆర్యుసిసి) సభ్యులుగా నామినేట్ అయ్యారు.2026 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.ఆ మేరకు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ బి ప్రశాంత్ కుమార్ ద్వారా నవంబర్ 9వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు అందినట్లు రవీంద్రా రెడ్డి తెలిపారు. విజయవాడ రైల్వే అధికారులతో మాట్లాడి తనకు ఈ కమిటీలో సభ్యత్వం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రైల్వే ప్రయాణికుల సమస్యలు,రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులు,ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు,రైళ్ల రాకపోకలకు సంబంధించిన అంశాలపై చర్చించే ఈ కమిటీలో సభ్యునిగా రైల్వే అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించే అవకాశం లభించిందన్నారు.మొలకలపూడికి చెందిన వ్యక్తికి విజయవాడ రైల్వే డివిజన్ స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం గర్వకారణమని స్థానికులు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ గొట్టికాటి రవీంద్రా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.రైల్వే ప్రయాణికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మేజర్ న్యూస్‌కు తెలిపారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్