రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
రేణిగుంట మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రేపు మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టత రానుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది.