telangana
కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్
సూర్య గన్నేరువరం : గన్నేరువరం మండలంలోని వడ్లు కొనుగోలు కేంద్రాలని సిపిఐ నాయకులు బుధవారం రోజున పరిశీలించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే వరి కోతలు మొదలై కేంద్రాలకు వడ్లు వస్తున్నాయని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసారు . రైతుల దగ్గర దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. దళరులు తూకం వేసే పద్ధతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనీ అన్నారు ప్రభుత్వం చోరువా చూపి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతల అంజిరెడ్డి మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం మండల సహాయ కార్యదర్శి కూన మల్లయ్య గన్నేరు వారం గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య మండల నాయకులు ఎండీ నాయిమ్ బుట్ల భాస్కర్ రాపోలు రాజమల్లు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.