BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ *

Select Suryaa Now
మేజర్ పంచాయితీ  మనదే కావాలి...  * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ *

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట మేజర్ పంచాయతీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి పొట్నూరు వాణి,  గెలుపుకు నాయకులందరూ సమన్వయంతో పని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ నరసన్నపేట వైఎస్ఆర్సిపి నాయకులకు  సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలోని ముఖ్య నాయకులతో బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా నరసన్నపేట మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మేజర్ పంచాయతీ పరిధిలోని ముఖ్య నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.