BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Select Suryaa Now
భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

రంగారెడ్డి : భూ రీసర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు సంబంధించిన భూములను క్షేత్రస్థాయిలో కచ్చితంగా గుర్తించి, సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బుధవారం ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, రైతుల భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి రైతు భూమి సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు.

సర్వే నిర్వహణకు కనీసం 24 గంటల ముందుగానే సంబంధిత పట్టాదారులకు నోటీసులు అందించాలని ఆదేశించారు. ఏ రోజు, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో సర్వే నిర్వహించనున్నారో ముందస్తుగా రైతులకు తెలియజేయడంతో పాటు నోటీసులు అందించిన వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. సర్వేకు హాజరైన రైతులు, నోటీసులు అందుకున్నప్పటికీ హాజరుకాని పట్టాదారుల వివరాలను సైతం నమోదు చేయాలని సూచించారు.

సర్వే నంబర్ల ఆధారంగానే కాకుండా రైతుల వారీగా భూములను గుర్తించి హద్దులు నిర్ధారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన చోట ఫ్లాగ్‌లు ఏర్పాటు చేసి, రైతులకు వారి భూముల సరిహద్దులను ప్రత్యక్షంగా చూపిస్తూ వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలన్నారు. సర్వే అనంతరం భూమి విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర వివరాలను కచ్చితంగా నమోదు చేసి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి సర్వే వివరాలకు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. భూ రీసర్వేపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. సర్వేలో నిర్లక్ష్యం, తొందరపాటు నిర్ణయాలకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

భూ రీసర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు, గ్రామస్థులు సర్వే బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాంరెడ్డి, తహశీల్దార్ సునీత, సర్వేయర్లు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

వడ్ల శ్రీనివాస చారి, రంగారెడ్డి - మేజర్ న్యూస్