BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా

Select Suryaa Now
మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా
సూర్య కరీంనగర్ ప్రతినిధి : భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. బుధవారం పాత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. విద్యాభివృద్ధి, లౌకికవాదం, జాతీయ సమైక్యతకు ఆజాద్ చేసిన కృషి మరువలేనిదని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ స్వామి, మైనారిటీ సంక్షేమ అధికారి జలాలుద్దీన్ అక్బర్, డీఈఓ తిరుపతిరావు, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు కాళీచరణ్, మాధవి, యమున, తాజుద్దీన్, కార్పొరేటర్లు మహ్మద్ యూసుఫ్, హుంస, మైనారిటీ నాయకులు ఎంఏ సిరాజ్, సిరాజ్ హుస్సేన్, ఎస్ఏ మొహాసేన్, అబ్బాస్ సమీ, మహమ్మద్ జమీల్, ముఖద్ రియాజ్ అలీ, రజజ్వి, షోబు, రహమాన్, నవాజ్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.