పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి
పాచిపెంట, సూర్య : అంగన్వాడి కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల్లో బాస నైపుణ్యాలను పెంపొందించాలని స్థానిక ఐసిడిఎస్ సిడిపిఓ బొత్స అనంతలక్ష్మి సూచించారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ బొత్స అనంతలక్ష్మి మాట్లాడుతూ "పోషణ భీ -పడాయి భీ"కార్యక్రమంలో భాగంగా ఆరు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పోషణ మరియు అభ్యాసన గురించి రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడం, పిల్లలు శారీరిక ఎదుగుదలకు ప్రాథమిక ఇవ్వడం, పిల్లల మానసిక వికాసాన్ని ప్రోత్సహించడం, ఆటపాటల ద్వారా విద్యను అందించడం, మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు పాఠశాల పూర్వ ప్రాథమిక విద్యను అందించడం, పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించడం, సంఖ్య జ్ఞానం, ఆలోచన శక్తిని అభివృద్ధి చేయటం, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం, తల్లిదండ్రులకు పిల్లలు వాసన మరియు విద్య పట్ల అవగాహన కల్పించడం, పిల్లల పాసనా మరియు అభ్యసన పైన అంగన్వాడీ కార్యకర్తల నైపుణ్యతను అభివృద్ధి చేయటం మొదలుకు అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.