పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే
గరుగుబిల్లి, సూర్య : మండల ప్రజా పరిషత్ అధ్య క్షులు(ఎంపీపీ) మరియు ఉపాధ్యక్షుల ను(వైస్ ఎంపీపీ) ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.ఈమేరకు ఈ నెల 19వ తేదీన మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ),మండల పరిషత్ ఉపాధ్యక్షులు (వైస్ ఎంపీపీ)తోపాటు కోఆప్షన్ సభ్యులు ఎన్నికల నిర్వహణ కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)తో పాటు వైస్ ఎంపీపీకి జరిగే ఎన్నికల ప్రక్రియ చేతు లెత్తే విధానంలో జరగనుంది.మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును చేస్తున్నారు. ఈనెల 19న జరిగే ఎంపీపీ వైస్ ఎంపీపీ కో ఆప్షన్ సభ్యుల ఎన్ని కలకు హాజరుకావాలని కొత్తగా ఎన్ని కైన ఎంపిటిసి సభ్యులకు ఈనెల 14 లోపు నోటీసులు అందజేయనున్నారు.19వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఎంపీపీ, వైఎస్ ఎంపిపి పదవులకు పోటీ చేసే వారి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబి తాను 12 గంటలకు ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ ల ఉపసంహర ణకు అవకాశం ఉంటుంది. ఒంటిగంట కు కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహించడం జరుగుతుందని మండల ఎన్నికల అధికారి ఎం వాణి శైలజ, ఉప ఎన్నికల అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈనెల 19న నిర్వహించ నున్న ఎంపీపీ,వైస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.