BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు?

Select Suryaa Now
మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు?

గరుగుబిల్లి, సూర్య : మండల పరిషత్తు వైస్ ఎంపీపీ పదవికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సంతోషపురం ఎంపీటీసీ సభ్యులు అంబటి తవిటి నాయుడు(రాంబాబు) అభ్యర్థత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం దాదాపు గా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మండలం పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ)గా ఉల్లిభద్ర ఎంపీటీసీ సభ్యులు, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మరడాన నారాయణస్వామి పేరును ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటిం చడం జరిగింది. అయితే మండల పరిషత్ ఎన్నికలు పూర్తి కావడంతో త్వరలోనే ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు సంబంధించి పరోక్ష ఎన్నికలు జరగను న్నాయి. ఎంపీపీ ఎన్నిక పూర్తయిన అనంతరం మండల పరిషత్తు ఉపాధ్యక్ష పదవికి ఒక ఎంపీటీసీని ఎన్నుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో వైస్ ఎంపీపీ పదవిని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి తవిటినాయుడు (రాంబాబు) పేరును పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే వైస్ ఎంపీపీ పదవి కోసం పలువురు ఆశావాహులు పోటీపడుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీని యార్టీకి ప్రాధాన్యతనిస్తూ అంబటి రాంబాబుకే వైస్ ఎంపీపీ పదవిని కట్టబెట్టాలని దాదాపుగా నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే అంబటి రాంబాబు గతంలో వైస్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించడం తో పాటు పలుమార్లు ఎంపీటీసీ, సర్పంచ్ గా పదవులు నిర్వహించారు. అదే విధంగా పార్టీకి సంబంధించిన పలు పదవులను నిర్వహించారు. ప్రస్తుతం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల పరిధిలోని 13 ఎంపీ టీసీ స్థానాలకుగాను తెలుగుదేశం, జనసేన పార్టీ తరఫున గెలుపొందిన పదిమంది ఎంపీటీసీలలో సంతోష పురం ఎంపీటీసీ సభ్యులు అంబటి రాంబాబు మినహా మిగిలిన 9 మంది కొత్త ఎంపీటీసీ సభ్యులే.పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి పనిచేయడం, స్థానికంగా ఉన్న ప్రజాదరణను పరిగణలోకి తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంబటి రాంబాబు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలు స్తోంది.కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం అంబటి రాంబాబుకు మండల పరిషత్తు ఉపాధ్యక్షులు పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మొదటినుంచి కష్టపడుతున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు అంబటి రాంబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.