telangana
ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్
సూర్య కరీంనగర్ : భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ జలాలుద్దీన్ అక్బర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా పోరాడిన మహోన్నత నాయకుడని, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని అన్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అనే భావనతో దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి, ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు విశేష కృషి చేశారని కొనియాడారు.