నీటి పొదుపును పాటించకపోతే ఇబ్బందులే. చిత్రకారుడు విజయ్
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఎల్ నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది తగినంతగా వర్షాలు కురవకపోవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేస్తున్న సందర్భంలో నీటి పొదుపు అవసరాన్ని తెలియజేసే ఒక సందేశాత్మక చిత్రాన్ని ఆళ్ళగడ్డకు చెందిన చిత్రకారుడు, ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య వ్యవహారిక కార్యదర్శి విజయ్ బుధవారం చిత్రించారు.ఈ చిత్రంలో, నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి కేవలం ఒక జగ్గు నీటిలో టవెల్ అద్ది తన శరీరాన్ని తుడుచుకుంటూ కనిపిస్తారు. దీనిని చూసి, “అలా ఎందుకు చేస్తున్నారు?” అని ఆయన మనవడు ప్రశ్నిస్తాడు. దీనికి ఆ తాత “నీటి పొదుపును ప్రతి ఒక్కరూ పాటించాలి” అని సమాధానమిస్తారు.
ఈ చిత్రం ద్వారా నీటిని వృథాగా చేయరాదని ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై శ్రద్ధ వహించాలని చిత్రకారుడు విజయ్ సందేశం ఇచ్చారు. వర్షాభావం ఉన్నప్పుడు నీటి నిల్వ, పునర్వినియోగం, జాగ్రత్తగా వినియోగంచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు నివారించవచ్చునని ఏపీ వినియోగదారుల సంఘ సమాఖ్య వ్యవహారిక కార్యదర్శి విజయ్ వివరించారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా