BREAKING
ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు! రిటైర్డ్ వెటర్నరి డాక్టర్ రామకృష్ణ రెడ్డి మృతికి వెంకట శివుడు యాదవ్ సంతాపం

జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

Select Suryaa Now
జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి

కొత్తవలస, సూర్య : స్థానిక పట్టణంలోన జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యాల నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న సంగ్రహణాత్మక నిర్మాణ పరీక్షల తీరును పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను, పరీక్షల నిర్వహణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించి సంతృప్తి చెందారు. అనంతరం పాఠశాల ఆటస్థలంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న బడ్డీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకుని, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని, పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. ఆకస్మిక తనిఖీలో వారితో పాటు మండల విద్యాశాఖ అధికారులు జి శ్రీదేవి,బి శ్రీనివాస్ రావు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె .శేషగిరిరావు ఉపాధ్యాయులు డాక్టర్.బి. గోవింద నాయుడు, బండారు మోహన్ రావు,వంగపండు అప్పారావు  ఏ గిరిజా రమణారావు సన్యాసిరావు, కోటేశ్వరరావు, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.