BREAKING
రేపు ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఏపీలో అపారమైన అవకాశాలు త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు చిట్టమూరులో పోషణ్ శిక్షణ కార్యక్రమం బాల్య వివాహాలు, వరకట్నం,మహిళా భద్రతపై అవగాహన డిఆర్యుసిసి సభ్యునిగా గొట్టికాటి రవీంద్రా రెడ్డి రైల్వే సేవల అభివృద్ధి కమిటీలో గొట్టికాటికి స్థానంపై పలువురి హర్షం అమెరికా కోర్టు సమన్లపై భారత్ అభ్యంతరం: అజిత్ దోవల్, సామంత్ గోయల్ వివాదం అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, బెల్టులు, షూస్ పంపిణీ కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌పై ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లకు గాయాలు పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు * సముద్రాలలో వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అట్ల శ్రీనివాస్ రాణి మల్లమ్మ దేవి పార్కు ను పరిశీలించిన మున్సిపల్ ఎన్నికలు ప్రకృతి వ్యవసాయం రైతుల బాధ్యతగా మారాలి! ముంద్రా ప్లాంట్ పునరుద్ధరణ, సోలార్ వ్యాపారంతో భారీ లాభాలు వీళ్లే విజేతలు ...

పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి

గరుగుబిల్లి, సూర్య : త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ పేర్కొన్నారు.మండ ల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యద ర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నడిమింటి సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటించా లని సూచించారు.గ్రామాల్లోని ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచిం చారు. గ్రామాల్లో ఓటర్ల తుది జాబితా పరిశీలన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అక్కడ కల్పించా ల్సిన కనీస మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు.సమ స్యాత్మక గ్రామాలను ముందస్తుగా గుర్తించి నివేదిక అందించాలని ఎంపీడీ వో నడిమింటి సూర్యనారాయణ ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాల యం ఏవో అర్జునరావు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రా ల వద్ద ఏర్పాట్లు,బ్యాలెట్ బాక్సుల భద్రత వంటి అంశాలపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.ఈసమావే శంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు బంటు అప్పారావు, తిరుపతి భాస్కర రావు, సూరు శ్రీనివాసరావు, రంభ శశిభూషణరావు, బొంతల వైకుంఠ రావు, నీరస రవికుమార్, అడ్డూరి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.