BREAKING
కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి - సిపిఐ నాయకులు డిమాండ్ మేజర్ పంచాయితీ మనదే కావాలి... * మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ * ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు: కంగనా రనౌత్ ఆరోపణలతో రాజకీయ కలకలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం - కలెక్టర్ చిత్రా మిశ్రా మెగాస్టార్ 'విశ్వంభర' డబ్బింగ్ అప్‌డేట్.. త్వరలోనే థియేటర్లలోకి సోషియో ఫాంటసీ వండర్! పిల్లల్లో భాష నైపుణ్యాలను పెంపొందించాలి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 జయంతి వేడుకలు పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే సుడిగాలి సుధీర్ 'గోట్' సినిమా వేదికపై కన్నీటి పర్యూమంతమైన హీరోయిన్ దివ్యభారతి.. అసలు ఏం జరిగిందంటే! చిరు వ్యాపారులపై నోటీసుల పేరుతో వేధింపులా? మండల పరిషత్ "వైస్ ఎంపీపీ"గా అంబటి రాంబాబు? ఇల్లందకుంటలో ఉచిత AI (ఏఐ) శిక్షణ కేంద్రం ప్రారంభం ఆ విజయం పెంచిన బాధ్యతతో వస్తున్నాం.. 'డీఎన్కే' సినిమాపై మౌళి తనూజ్ ప్రశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! పారమ్మకొండకు పర్యాటక కళ తీసుకొస్తాం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

సిద్దిపేట, ; భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో (ఐడీఓసీ) మైనారిటీస్ సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు బాధ్యతలతో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి డి. నాగరాజమ్మ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీక్, విజిలెన్స్ అధికారులు గౌస్ పాషా, జగదీశ్వర్ రెడ్డితో పాటు ముస్లిం మైనారిటీ వర్గాల ప్రముఖులు, క్రైస్తవ మైనారిటీ పెద్దలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో, విద్యారంగ అభివృద్ధిలో, జాతీయ సమైక్యత సాధనలో మౌలానా ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మహనీయుడు మౌలానా ఆజాద్ అని పేర్కొన్నారు. విద్యా వికాసం, సామాజిక సమానత్వం, మత సామరస్యం, సోదరభావం, జాతీయ సమైక్యత కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా మైనారిటీ వర్గాల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని మతాల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిస్తూ విద్యాభివృద్ధికి, మైనారిటీల సంక్షేమానికి కృషి చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముగిసింది.