అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 19మంది పై బైండ్ ఓవర్
బలిజిపేట, సూర్య : మండలంలో అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 19మంది పాత ముద్దాయిలపై మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆర్. బాల మురళి కృష్ణ వద్ద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని సీతానగరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి. పద్మావతి తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలంలో మరలా అక్రమ మద్యం కేసుల్లో పట్టుపడటం అయితే లక్ష రూపాయలు జరిమానాతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడును అని. ఈ సందర్బంగా ప్రైవేట్ ఎ 4 మద్యం షాప్ యజమానులకు చట్టంలో గల నియమ నిబంధనలను పాటించాలని, మధ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, ఎక్కడైనా గొలుసు దుకాణాలు గాని, ఇతర రాష్ట్రాలకి చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గాని, నాటు సారాయి గాని అమ్మకాలు జరిపినచో కఠిన చర్యలు తీసుకోబడునని మరియు 8897500240(సీఐ) నెంబర్ కి తెలియపరచాలని సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.