telangana
360 డిగ్రీ యాప్ ద్వారా చేయూత పింఛన్ల లబ్ధిదారుల వివరాల పరిశీలన
సూర్య,కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో చేయూత పింఛన్ లబ్ధిదారుల వివరాలను 360 డిగ్రీ యాప్ ద్వారా ధృవీకరించే కార్యక్రమం కొనసాగుతోంది.మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపడుతున్నారు. ఇందులో భాగంగా సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను పరిశీలిస్తూ యాప్‌లో నమోదు చేసి ధృవీకరిస్తున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన పింఛన్‌దారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా ధృవీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ పింఛన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి అందేలా వివరాల పరిశీలన చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.