సూర్య,కాగజ్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎలైట్ పురుషులు, మహిళల బాక్సింగ్ ఎంపిక పోటీలు నవంబర్ 11న కాగజ్‌నగర్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి కాగజ్ నగర్ కు తరలివచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తొమ్మిది మంది క్రీడాకారులు ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.మహిళల విభాగంలో సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన కె. సాత్విక (51–54 కేజీలు), మంచిర్యాలకు చెందిన ఒ. సంస్కృతి (54–57 కేజీలు) ఎంపికయ్యారు.పురుషుల విభాగంలో ఆదిలాబాద్‌కు చెందిన టి. అరుణ్ (47–50 కేజీలు), మంచిర్యాలకు చెందిన ఎ. రక్షిత్ (50–55 కేజీలు), నిర్మల్‌కు చెందిన ఎస్. శ్రీకాంత్ (55–60 కేజీలు), సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన వి. వంశీ (70–75 కేజీలు), వి. శివ (75–80 కేజీలు), మంచిర్యాలకు చెందిన కె. నిఖేత్ (85–90 కేజీలు), సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన ఎం. సాయికుమార్ (+90 కేజీలు) రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.