telangana
సర్ సిల్క్ బాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు - పొన్న రమేష్
సూర్య, కాగజ్ నగర్ :కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ ప్రాంతంలోని సర్ సిల్క్ మిల్లు కార్మికులు మిల్లుకు సంబంధించిన జాగాలలో 40 ఏళ్లుగా నివాసముంటున్నారు కానీ కార్మికులకు ఎవరు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటున్న రెవెన్యూ అధికారులు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పేదలు గౌరవంగా నివసించే, జీవించే హక్కు లు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే ఉన్నాయని రమేష్ గుర్తు చేశారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు బాధితుల సమస్యను పరిష్కరించాలి.. రాజకీయ విమర్శలతో మరింత జటిలం చేయొద్దన్నా రాయన.సిర్పూర్ నియోజకవర్గంలోని సర్ సిల్క్ కంపెనీ భూములు, క్వార్టర్లలో నివసిస్తున్న ప్రజలకు రెవెన్యూ శాఖ అధికారులు వారం రోజుల్లో నివాసాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఇళ్లు ఖాళీ చేయాలనే నోటీసులతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పొన్న రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం సర్ సిల్క్ క్వార్టర్లలో నివసిస్తున్న సుమారు మూడు వేల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సహా అన్ని పార్టీల నేతలు బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు చట్టబద్ధమైన పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. బాధితుల సమస్యను రాజకీయ విమర్శలకు, పరస్పర ఆరోపణలకు వేదికగా మార్చకుండా, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.40 ఏళ్లుగా పరిష్కారం కాని కార్మికుల సమస్యలు, ఇప్పుడు ఎదురైన ఇళ్ల ఖాళీ నోటీసులు.. ఈ రెండు అంశాలపై రాజకీయ నాయకులు తమ బాధ్యతను గుర్తించి బాధితులకు న్యాయం చేయాలి. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమస్యను మరింత పెంచకుండా, శాశ్వత పరిష్కారం చూపాలని పొన్న రమేష్ విజ్ఞప్తి చేశారు.