భారత్ సమ్మిట్ విజయవంతం చేయాలిః టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: గత ఏడాది నిర్వహించిన భారత్ సమ్మిట్–2025కు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరై విజయవంతం చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సదస్సులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు, పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం నిర్వహించనున్న భారత్ సమ్మిట్–2కు సుమారు 70 దేశాల నుంచి అంతర్జాతీయ నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై చర్చలకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుందని అన్నారు. భారత్ సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.