BREAKING
ఎంపీపీ పీఠం కూటమిదే.. వైస్ ఎంపీపీపై ఉత్కంఠ! బీమా పథకాలతో కుటుంబాలకు ఆర్థిక భద్రత: సీఎస్పీ నిర్వాహకురాలు స్రవంతి 108 ఏళ్ల ఘన చరిత్ర... రైతుల ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ అండ! మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం సీఎం సహాయ నిధి పేదలకు వరం-ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ అయ్యప్ప మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప సేవ సమితి స్వాములు రాజ్య పురస్కార అవార్డు సాధించిన ఎస్.ఆర్. ప్రైమ్ కళాశాల విద్యార్థిని ఆర్. సింధుప్రియ అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 19మంది పై బైండ్ ఓవర్ ఉపాధి పనులను పరిశీలించిన-ఎంపీడీఓ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది.."పోషణ్ భీ-పడాయీ భీ"...సీడీపీఓ కె రాజ్యలక్ష్మి నీటి పొదుపును పాటించకపోతే ఇబ్బందులే. చిత్రకారుడు విజయ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్ చిన్నారులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి తాండూరు వ్యాపారవేత్త శంకర్ యాదవ్‌కు అంతర్జాతీయ సేవారత్న అవార్డు

వీఓ భవనానికి స్థలం కరువు.. డ్వాక్రా మహిళల ఆవేదన!

Select Suryaa Now
వీఓ భవనానికి స్థలం కరువు.. డ్వాక్రా మహిళల ఆవేదన!
సూర్య, చింతలమానేపల్లి : మండలం డబ్బా గ్రామంలో డ్వాక్రా మహిళలకు వీఓ (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించకపోవడంపై మహిళా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ, అధికారులు స్థలం చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో డ్వాక్రా మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, బ్యాంకు లింకేజీ తదితర కార్యక్రమాలు చేపట్టడానికి సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. మరోవైపు గ్రామంలోని ప్రభుత్వ భూములు కొందరి ఆక్రమణలకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు, బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మహిళా సంఘాల భవనానికి మాత్రం స్థలం కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సంతోష్ డోంగ్రె మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆక్రమణల తొలగింపుపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించి, డ్వాక్రా మహిళల వీఓ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే గ్రామంలోని సుమారు 500 మంది మహిళలను, యువతను సమీకరించి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని సర్పంచ్ సంతోష్ డోంగ్రె, మహిళా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.