BREAKING
ఎంపీపీ పీఠం కూటమిదే.. వైస్ ఎంపీపీపై ఉత్కంఠ! బీమా పథకాలతో కుటుంబాలకు ఆర్థిక భద్రత: సీఎస్పీ నిర్వాహకురాలు స్రవంతి 108 ఏళ్ల ఘన చరిత్ర... రైతుల ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ అండ! మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం సీఎం సహాయ నిధి పేదలకు వరం-ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ అయ్యప్ప మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప సేవ సమితి స్వాములు రాజ్య పురస్కార అవార్డు సాధించిన ఎస్.ఆర్. ప్రైమ్ కళాశాల విద్యార్థిని ఆర్. సింధుప్రియ అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన 19మంది పై బైండ్ ఓవర్ ఉపాధి పనులను పరిశీలించిన-ఎంపీడీఓ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది.."పోషణ్ భీ-పడాయీ భీ"...సీడీపీఓ కె రాజ్యలక్ష్మి నీటి పొదుపును పాటించకపోతే ఇబ్బందులే. చిత్రకారుడు విజయ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్ చిన్నారులను ఆశీర్వదించిన చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి తాండూరు వ్యాపారవేత్త శంకర్ యాదవ్‌కు అంతర్జాతీయ సేవారత్న అవార్డు

ఖానాపూర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఖానాపూర్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
సూర్య ఖానాపూర్ :  భారత స్వాతంత్ర్య సమరయోధుడు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఖానాపూర్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, భారతదేశ విద్యావ్యవస్థ పటిష్టతకు, విద్యారంగంలో సంస్కరణలకు మౌలానా ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు విద్యలో ముందుండి, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య భారత నిర్మాణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరువలేనిదని, జాతీయ సమైక్యత, మతసామరస్యం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్ నిమ్మల రమేష్, ఏజీపీ ఆసిఫ్ అలీ, మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖాలీల్, న్యాయవాది షబ్బీర్ పాష , ఎండీసీ అధ్యక్షులు ఇర్ఫాన్ దానిష్, ఎంపీజే అధ్యక్షులు న్యాయవాది షేక్ ఖదీర్, ఎంఐఎం అధ్యక్షులు అఖిల్,అఫ్సర్ ఖాన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డా. కె.హెచ్. ఖాన్, షేక్ నసీర్, షకీలుద్దీన్, వహాబ్, అజీమ్, సఫ్దర్, కరీం కాలనీ మసీదు అధ్యక్షులు వాసే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.