telangana
జైనూర్ డివిజన్ స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలి – ఏటీడీఓ శ్రీనివాస్
సూర్య జైనూర్: ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గిరిజన విద్యార్థుల క్రీడా పోటీలను విజయవంతం చేయాలని జైనూర్ ఏటీడీఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం జైనూర్‌లో డివిజన్ పరిధిలోని ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న విద్యార్థుల క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి డివిజన్, జోనల్, రాష్ట్రస్థాయి వరకు విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, తగిన శిక్షణ అందిస్తూ ఉన్నతస్థాయి పోటీలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.క్రీడా పోటీల నిర్వహణలో సమన్వయంతో పనిచేసి జైనూర్ డివిజన్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీ సోమవారం కోహినూర్ (కె) ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు బిక్కు, చొక్కారావు, వినోద్, వెంకటేశ్వరరావు, అరవింద్, వనిత, సుందర్, లక్ష్మణ్, ఈశ్వర్, జల్పాత్, సంగీత, హీరాబాయి తదితరులు పాల్గొన్నారు.