national
కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మీర్ బజార్ సమీపంలోని అఖ్రాన్ వద్ద ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) క్యాంప్/పోస్ట్ లక్ష్యంగా బుధవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో దుండగులు మెరుపు దాడికి పాల్పడ్డారు.
ద్విచక్రవాహనంపై వచ్చిన అపరిచిత ఉగ్రవాదులు అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉన్నపళంగా అంధాధుందీగా కాల్పులు జరిపారు.
గాయపడిన జవాన్లను తక్షణమే అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.