అసోంలో తప్పిన పెను ప్రమాదం: పట్టాలు తప్పిన సైరాంగ్ ఎక్స్‌ప్రెస్, ఏడుగురికి గాయాలు
గువహాటి: అసోం రాష్ట్రంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. డిగరూ సమీపంలో ప్రయాణిస్తున్న సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇంజిన్‌తో పాటు ఏడు బోగీలు పట్టాలు తప్పుకోవడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న తక్షణమే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పట్టాలు మారే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రధానమైన రెండు లైన్లు దెబ్బతినడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.