భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన దాంపత్య వ్రత మహోత్సవం
ఆత్మకూరు/మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణ శివారులోని జివిఆర్ కాన్వన్సీ హాల్లో నేడు దాంపత్య వ్రత మహోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. శ్రీ భగవాన్ రామదూత స్వామి వారి దివ్య దర్శనం లో భాగంగా వేణు దత్త స్వర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ దంపతులు, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు దంపతులు మాజీ వైస్ ఎంపీపీ కోటేష్ దంపతులు పాల్గొన్నారు. దైవ చింతనా ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని స్వామీజీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ దీక్షితులు, పూర్ణానంద దీక్షితులు ,విశ్వనాథ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.