BREAKING
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మీ ప్రసాదన్న మీ కోసమే ఉన్నాడు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నా మనస్సంతా చీపురుపల్లె సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. గాంధీ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదానం - ఎంపీ సునీల్ కడియం మండలం వేమగిరిలో దారుణం.. 16 ఏళ్ల బాలుడు మృతి వి.బి.జి. రామ్ జీ పనులపై విధివిధానాలు పాటించాలి – ఎంపీడీవో రమేష్ స్టాక్ మార్కెట్ టుడే: 11 నవంబర్ ట్రేడింగ్ గైడ్ బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు: ఏపీకి అలర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్: పక్కా కార్యాచరణ ఏపీకి రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు: కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఎన్విడియా సీఈఓపై దర్యాప్తు: బోర్డు కీలక నిర్ణయం హోర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా ఆందోళన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు: 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపిక డిజిటల్ అరెస్ట్ మోసాలు: వాట్సాప్‌కు సుప్రీంకోర్టు ఆదేశం సౌదీకి ఇండిగో విమానాల రద్దు పొడిగింపు: నవంబర్ నెలాఖరు వరకు స్టాక్స్ టు వాచ్: డేటా ప్యాటర్న్స్, ఎంఆర్‌ఎఫ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా

వి.బి.జి. రామ్ జీ పనులపై విధివిధానాలు పాటించాలి – ఎంపీడీవో రమేష్

Select Suryaa Now
వి.బి.జి. రామ్ జీ పనులపై విధివిధానాలు పాటించాలి  – ఎంపీడీవో రమేష్

 

సూర్య, భీమిని: వి.బి.జి. రామ్ జీ పథకం పనుల నిర్వహణలో నిర్దేశించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీవో రమేష్ సూచించారు. మంగళవారం భీమిని మండల పరిషత్ కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించి నిర్వహించిన మొదటి విడత ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన విధివిధానాలు, అమలు తీరు, మేట్ల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులు, పనుల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలపై మేట్లకు అవగాహన కల్పించారు. కూలీల హాజరు నమోదు, పని ప్రదేశంలో కూలీల వివరాల నిర్వహణ, రోజువారీ పనుల పర్యవేక్షణ, పనుల కొలతల నమోదు, పారదర్శకత వంటి కీలక అంశాలను వివరించారు. అలాగే పథకం అమలులో ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సత్యప్రసాద్, ఈసీ రాజేంద్రప్రసాద్, టీఏ వేణు భార్గవ్, శ్యామ్ గల్ తదితరులు పాల్గొని మేట్లకు విధులు, బాధ్యతలు, కొలతల నిర్వహణపై తగిన సూచనలు, సలహాలు అందించారు.