BREAKING
వి.బి.జి. రామ్ జీ పనులపై విధివిధానాలు పాటించాలి – ఎంపీడీవో రమేష్ స్టాక్ మార్కెట్ టుడే: 11 నవంబర్ ట్రేడింగ్ గైడ్ బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు: ఏపీకి అలర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్: పక్కా కార్యాచరణ ఏపీకి రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు: కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఎన్విడియా సీఈఓపై దర్యాప్తు: బోర్డు కీలక నిర్ణయం హోర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా ఆందోళన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు: 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపిక డిజిటల్ అరెస్ట్ మోసాలు: వాట్సాప్‌కు సుప్రీంకోర్టు ఆదేశం సౌదీకి ఇండిగో విమానాల రద్దు పొడిగింపు: నవంబర్ నెలాఖరు వరకు స్టాక్స్ టు వాచ్: డేటా ప్యాటర్న్స్, ఎంఆర్‌ఎఫ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా భారత ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల వెల్లువ: రూ. 53,739 కోట్ల పెట్టుబడులు గిఫ్ట్ నిఫ్టీ జోరు: మార్కెట్లకు పాజిటివ్ ఓపెనింగ్ సంకేతాలు నేడు స్టాక్ మార్కెట్లు ప్రారంభం: ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈలో ట్రేడింగ్ పునరుద్ధరణ అలీబాబా చిప్ విభాగం ఐపీఓ: హాంకాంగ్‌లో టి-హెడ్ లిస్టింగ్

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

పెద్దకొత్తపల్లి,సూర్య న్యూస్: మండల పరిధిలోని పెద్దకర్పాముల  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మంజూరు చేసిన నిధులతో గ్రంథాలయ జిల్లా మాజీ చైర్మన్ నాగపురి  విష్ణు ఆధ్వర్యంలో నిర్మాణ పనులకు ముగ్గు పోసి శ్రీకారం చుట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయితే విద్యార్థుల భద్రతకు రక్షణ, భద్రత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిర్మాణం దోహదపడుతుందన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలాల్ చిట్టెమ్మ శివుడు, ఉపసర్పంచ్ మెరుగు వీరస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు, ఎంఈఓ జియావుద్దీన్, మాజీ సర్పంచులు దొండ శ్రీనివాసులు, పరమాల శ్రీనివాసులు, వార్డు సభ్యులు తుమ్మల సూరి, చంద్రకళ, శ్రీనివాసులు, మాజీ డైరెక్టర్ పరమాల వినోద్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సాతాని మహేశ్వరం, సాతాని వెంకటేష్, శివ, బాలస్వామి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.